పాపాల భైరవుడికి శిరచ్చేదన జరుగుతుంది

పాపాల భైరవుడికి శిరచ్చేదన జరుగుతుంది
  • దండుపాలెం బ్యాచ్ ని పొలిమర్లు దాటించాలి
  • టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి


ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది పాపాల భైరవుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కు శిరచ్ఛేదన జరుగుతుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనంగా ఘన్ పూర్ కేంద్రంలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు గా కాంగ్రెస్ జెండాను ఎగరావేసే భాద్యత నాపై ఉందన్నారు. కేసీర్ సీఎం అయ్యాక, రాజయ్య లాంటి ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలను ఇంట్లో నుండి బయటకు పంపడానికి ప్రజలు బయపడుతున్నారు అన్నారు.

ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడే బిఆర్ఎస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య, రాజయ్య నా కృష్ణయ్య నాకు అర్ధం కావట్లేదు అని ఎద్దేవ చేశారు. సీఎం కేసీర్ కడియం, రాజయ్యలను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిలుగా నియమించి తొలగించిన వీరికి సోయి రాలేదన్నారు. నియోజకవర్గం లో డిగ్రీ కాలేజ్, వంద పడకల ఆసుపత్రి తేలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే 100 పడకల ఆసుపత్రి ఇస్తా, డిగ్రీ కాలేజ్ కట్టించే భాద్యత తీసుకుంటా అని హామీ ఇచ్చారు.10 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చిన బిఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్,హరీష్ రావు, కేటీఆర్, రాజయ్య, శ్రీహరి ఓట్ల కోసం వీధులలో పిచ్చి కుక్క తిరిగినట్టు తిరిగుతున్నారు ఆరోపించారు. నువ్వు 6 గురు మహిళలు కు టికెట్ ఇస్తే, నేను 12 మందికి టికెట్ ఇచ్చాను.

బడికి పోయే పిలగాండ్లకు బీరు సీసా చేతులో పెట్టి ప్రజలను తాగుడుకు బానిసలను చేసి తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దాడని ధ్వజమెత్తారు. రాష్ట్రం నిరుద్యిగంలో, అత్యాచారాలలో మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత కెసిఆర్ కు దక్కిందన్నారు.ఇక్కడే నీ పక్కనే ఓ వెన్నుపోటు, దద్దమ్మ, దగుల్బాజీ దయాకర్ రావు ఉన్నాడు జీతాలు రావట్లేదు అని ఉద్యోగస్తులు అడిగితే ఖాళీ సీసాలు అమ్ముకో అన్న ఘనుడు దయాకర్ రావు అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం దండుపాళ్యం ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక, ఉపాధి లేక కొట్లాడి కొట్లాడి అడవి బాట పట్టాల అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఓదార్చాల్సింది పోయి, వాళ్ళ పరువు ను బజార్ లో పడేషారు ఆవేదన వ్యక్తం చేశారు. 100 తప్పులు చేసిన శిశుపాలుడు తరహాలో కెసిఆర్ రాజ్యం కూల్చాల్సిందే అన్నారు.

గృహలక్ష్మి, సిలిండర్ 500/- కు రైతు భరోసా, ఉపాధి హామీ కూలికి ఏటా 12 వేలు, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తాము హామీ ఇచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు, విద్యార్థుల కు 5 లక్షలు, సోనియమ్మ రాజ్యం వస్తే 4 వేలు ఆరోగ్య శ్రీ పధకంలో 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాము అన్నారు. అభ్యర్థి సింగపురం ఇందిరా మాట్లాడుతూ ఇల్లు, ఓటు హక్కు లేని శ్రీహరి స్థానికేతరుడు తప్ప నేను కాదన్నారు. ఎన్కౌంటర్లో శ్రీహరి దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్నారు. శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాతో పోటీకి దిగాలన్నారు. ఈ సమావేశంలో అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, ఎసిసి పరిశీలకు రవీంద్ర కుమార్ దాల్వి, సమ్మక్క, అమృత రావు నరేందర్ రెడ్డి, నగర బోయిన శ్రీరాములు, కాసాని బొందయ్య, కట్టా మనోజ్ రెడ్డి, శిరీష్ రెడ్డి, లింగోజి, మోటం శీను వెంకటేశ్వర్లు, జగదీష్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.