కెసిఆర్ రాష్ట్రానికి శ్రీరామరక్ష

కెసిఆర్ రాష్ట్రానికి శ్రీరామరక్ష
  • మీరే నా బలం.. నా బలగం
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గడిచిన పదేళ్లుగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణకు శ్రీరామరక్షని ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రూ.76 కోట్ల 43 లక్షల అభివృద్ధి పనుల మంజూరి పత్రాలను ఆదివారం స్థానిక సిరిపురం గార్డెన్ లో అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ భాగాల సంపత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గడిచిన మూడు నెలల్లో తన సిడిఎఫ్ నిధులతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ ప్రకాష్, బసవరాజు సారయ్యల సహకారంతో పై నిధులు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. మూడు నెలలలో రూ.76 కోట్లు తెస్తే వచ్చే ఐదేళ్లలో ఎన్ని కోట్లు తేవచ్చు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు ఊహించుకోవాలన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటా. కుటుంబ సభ్యులుగా మీ అందరినీ కంటికి రెప్పలా దాచుకుంటా. మీరే నా బలం.. మీరేనా బలగం అని శ్రీహరి అన్నారు.

 తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పదేళ్ల తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ తారతమ్యాలు, మనస్పర్ధలు లేకుండా పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీహరి పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తూ మనల్ని ఆదర్శంగా తీసుకున్న అన్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవలే మనకు వచ్చిన అవార్డులు రివార్డులు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని, సమస్యల్ని పట్టించుకోని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజల ముందుకు వస్తుందన్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని ఆ పథకాలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. వందేళ్ల కాంగ్రెస్ అంపశయ్యపై కొట్టు మాట్లాడుతుందని బుల్డోజర్ ను పెట్టి లేపిన లేచే స్థితిలో లేదన్నారు. 

గ్రామాల్లో పునాదులు లేని బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎజెండాగా పెట్టుకుంది అన్నారు. కాంగ్రెస్, బిజెపిలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇచ్చిన హామీలు, అడగని పథకాలు అమలు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, ఎంపీపీ సరిత బాలరాజు, జడ్పిటిసిలు బేబీ శ్రీనివాస్, శ్రీలత, గుడి వంశీధర్ రెడ్డి నాయకులు ఎం. రాంబాబు, సిహెచ్.నరేందర్ రెడ్డి, బి.వెంకన్న, బి.శంకర్, ఏ.అయోధ్య, పి.సారంగపాణి, రాజేష్ నాయక్, పి.రజాక్, ఎస్.జగన్ ఎంపీటీసీలు, సర్పంచులు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.