ఉప్పలమ్మ ఆలయంలో పూజలు

ఉప్పలమ్మ ఆలయంలో పూజలు

ముద్ర, జనగామ టౌన్: తెలుగు సంవత్సరాది చివరి ఆదివారం సందర్భంగా ఉప్పలమ్మ దేవాలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏడాది చివర్లో అమ్మవారు ప్రజలందరిని ఎటువటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా, రాబోయే నూతన తెలుగు సంవత్సరం లో ప్రజలందరికీ సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో ఆలయ పూజారి ఓరుగంటి ఆంజనేయులు, శ్రీనివాస్, దశమంత రెడ్డి, వీరారెడ్డి, మార్గం రవి,  గట్టు దామోదర్, హరిశ్చంద్ర గుప్తా, అజ్జు, రమ, జ్యోతి, రేణుక హైమావతి, వీణ తదితరులు పాల్గొన్నారు.