జనగామలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కొన్ని రోజులుగా పట్టణంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి పూట ముసుగులు ధరించి మారణాయుధాలతో సంచరిస్తున్న నలుగురు ముఠా సభ్యుల వీడియోలను పోలీసు శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో గల వ్యక్తులు కనిపిస్తే ఈ కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసు శాఖ పేర్కొంది.

SHO Janagaon :  8712685202

SI Janagaon : 8712685259

PS : Janagaon  8712685032