'కరాటే'ను సద్వినియోగం చేసుకోవాలి: జీసీడీఓ గౌసియా బేగం

'కరాటే'ను సద్వినియోగం చేసుకోవాలి: జీసీడీఓ గౌసియా బేగం

ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల అత్మరక్షణ కోసం రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ పేరిట నేర్పిస్తున్న కరాటే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జీసీడీఓ గౌసియా బేగం కోరారు. 
జనగామ మండలం చౌడారం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కరాటే శిక్షణ తరగతులను స్పెషల్ ఆఫీసర్ రాణి ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్  కరాటే  అకాడమీ మాస్టర్ ఓరుగంటి సంతోష్ కుమార్ ప్రారంభించారు.

ఈ సంధర్బంగా గౌసియా బేగం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డీఈఓ రాము ఆదేశాల మేరకు జనగామ జిల్లా వ్యాప్తంగా 73 ప్రభుత్వ పాటశాలలలో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ క్లాసులు ప్రారంభమయ్యాయని, మూడు నెలల పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. నేటి సమాజంలో మహిళ లపై జరుగుతున్న అగాయిత్యాలను   ఎదుర్కునేందుకు, బాలికలు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలో కూడా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.