నిజామాబాద్ ఘటనపై ఆరోగ్య మంత్రి హరీష్ రావు సీరియస్ - సమగ్ర విచారణకు ఆదేశం

నిజామాబాద్ ఘటనపై ఆరోగ్య మంత్రి హరీష్ రావు సీరియస్ - సమగ్ర విచారణకు ఆదేశం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఓ రోగిని తల్లిదండ్రులు కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు.  పూర్తి వివరాలు తెలపాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా గత నెల 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బంగారు తెలంగాణా లో ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటన లా అంటూ ప్రశ్నిస్తున్నారు.    దీంతో జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు స్పందించి పూర్తి వివరాలు సేకరించారు.   మార్చి 31న  ఆ రోగిని అతని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే ఓ పి క్లోజ్ అయింది.  దీంతో రాత్రంతా వీల్ చైర్ పై కూర్చొని, మరుసటి రోజు ఉదయం డాక్టర్ కు చూయించేందుకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే  ఆసుపత్రి సిబ్బంది సహకరించకుండా, స్ట్రేచర్ ఏర్పాటు చేయకపోవడంతో, రోగి తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ వరకు తీసుకెళ్లారు.  దీంతో ఈ హృదయ విధారక ఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి, 15 రోజుల తర్వాత పోస్ట్ చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పై తీవ్ర విమర్శలకు దారి తీసింది.   ఈ ఘటన పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ విచారణ జరుపుతున్నారు