మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి  స్ట్రాంగ్ వార్నింగ్...

మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి  స్ట్రాంగ్ వార్నింగ్...

ముద్ర,తెలంగాణ:- హైదరాబాద్ మెట్రో ఆమ్మకానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఫ్రీ బస్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రీ బస్సు నేపథ్యంలో చాలామంది మహిళలు ఇందులోనే వెళుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు.

ఇక ఈ ఫ్రీ బస్సు పథకం కారణంగాబి తాము కూడా  తీవ్రంగా నష్టపోయామని, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని, నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టి కంపెనీ గత కొద్ది కాలంగా చెబుతోంది. అందువల్ల ఇక తాము మెట్రో సర్వీస్ లను నడపలేమని పేర్కొంటూ దాన్ని అమ్మకానికి పెట్టినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు'. అంటూ సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలిసింది