మినీ గురుకులాల్లో(2023-24) ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ -అదనపు కలెక్టర్ చంద్రమోహన్

మినీ గురుకులాల్లో(2023-24) ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ -అదనపు కలెక్టర్ చంద్రమోహన్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని నాచుపల్లి, మాచారెడ్డిలోని మినీ గురుకులాల్లో గల వివిధ తరగతుల్లోని  ఖాళీ భర్తీకి (2023-24)అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాచుపల్లిలోని మినీ గురుకులంలో ఒకటవ తరగతిలో 30 సీట్లతోపాటు రెండవ తరగతిలో 9  బ్యాక్ లాగ్ సీట్లు, మాచారెడ్డి ఒకటవ తరగతిలో 30, రెండవ తరగతిలో 5 బ్యాక్ లాగ్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆయా పాఠశాలల్లో చేరేందుకు నస్రుల్లాబాద్, మాచారెడ్డి మండలాలకు చెందిన PVTG /గిరిజన బాలికలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. 5 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న బాలికలు మే4 వ తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల  9 వ తేదీన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమక్షంలో లాటరీ పద్దతిన విద్యార్థినులను ఎంపిక చేస్తామన్నారు. తల్లిదండ్రులు ఆదాయపు దృవీకరణ పత్రంతోపాటు పుట్టిన తేదీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేసి గజిటెడ్ అధికారి దృవీకరణతో నాచుపల్లి, మాచారెడ్డి మినీ గురుకులాల్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాల కోసం 6300472214 (నాచుపల్లి), 6300132131 (మాచారెడ్డి) నెంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు.