ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్...

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్...
  • వారణాసిలో నేడు నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
  • నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
  • నిన్ననే వారణాసి వెళ్లిన పవన్... ఈ ఉదయం వారణాసి చేరుకున్న చంద్రబాబు
  • మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ అగ్రనేతలు
  • ఏపీలో పోలింగ్ ట్రెండ్ పై చంద్రబాబు, పవన్ లను అభినందించిన మోదీ
  • సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేసిన పవన్ కళ్యాణ్ , శ్రీమతి అనా కొణిదెల

భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యేందుకు ఉరకలేస్తున్నారు. ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి భాగస్వాములు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోదీ... ఏపీలో నిన్నటి పోలింగ్ ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, పవన్ లతో ఉత్సాహంగా మాట్లాడారు. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కూడా బెస్ట్ విషెస్ తెలిపారు.

అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు.  పవన్ కళ్యాణ్ , శ్రీమతి అనా కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి  శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా  శ్రీ పవన్ కళ్యాణ్  వెంట ఉన్నారు