భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి - ప్రధాని మోదీ 

భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి - ప్రధాని మోదీ 

భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రపంచాన్ని తాము ఒక కుటుంబంగా చూస్తామన్నారు. వసుధైక కుటుంబం అన్నది తమ నినాదమని అన్నారు. వన్​ సన్​, వన్​ వరల్డ్​, వన్​ గ్రిడ్​ అన్నది తమ విధానమన్నారు. వన్​ ఎర్త్​, వన్​ హెల్త్​ అని అన్నారు. కరోనా కష్టకాలంలో 150 దేశాలకు భారత్​ వ్యాక్సిన్​లు పంపించిందన్నారు.

100 కు పైగా దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్​లు అందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాలు భారత్​ కాపాడిందని మోదీ అన్నారు. నైపుణ్యానికి భారత్​లో కొదువ లేదన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. పాల ఉత్పత్తిలో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. ఇంటర్నెట్​ వినియోగంలో రెండో స్థానంలో ఉందన్నారు. భారత్​లో బ్యాకింగ్​ వ్యవస్థ బలంగా ఉందన్నారు.

దేశంలో విదేశీమారక ద్రవ్యం భారీగా ఉందని చెప్పారు. మూడు రోజుల పర్యటన కోసం మోదీ ఆస్ట్రేలియా వచ్చారు. భారత్​ గొప్పదన్నాన్ని ప్రవాసులకు వివరించారు. భారత్​ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు.