ఉప ఎన్నికలు ఏం చెబుతున్నాయి

ఉప ఎన్నికలు ఏం చెబుతున్నాయి

దేశంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు చాలా విషయాలు చెబుతున్నాయి.  త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విపక్షాలు మరింత తమ ఐక్యతను ప్రదర్శించాల్సిన బాధ్యతను గుర్తు చేసాయి. ముఖ్యంగా కాంగ్రెస్– తృణముల్ కాంగ్రెస్–వామపక్షాలు కలిసి ఉంటే ఫలితాలు వేరుగా ఉంటాయి. పుట్టి రెండేండ్లు కూడ కాని ‘త్రిపుర మోథా’ ఈ ఎన్నికలలో 12 స్థానాలు సాధించి అందరికీ, ముఖ్యంగా బీజేపీకి సవాల్ గా నిలిచింది. ఆదివాసీల వెంట ఉన్న ఈ మోర్చా ప్రత్యేక త్రిపుర ల్యాండ్ ను డిమాండ్ చేస్తున్నది. బీజేపీ, మిత్ర పక్షాల పీఎం నరేంద్ర మోడీ పర్యటనల మీద పర్యటనలు జరిపినా, వారు భావించినట్లు వన్ సైడ్ ఫలితాలు ఏమి రాలేదు.ఎగ బడి,ఎగ బడి నేషనల్ మీడియా లు చేసిన సర్వే ల మాదిరి ఫలితాలు లేవు.ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే మూడు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో కి రావడం పెద్ద విశేషమే! మహారాష్ట్ర లో బీజేపీ సీటు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది.మరో వైపు తమిళనాడు లో ఒక స్థానం లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది.అన్నింటికన్నా అశ్చర్యం,రికార్డు ఏమంటే బెంగాల్ లోని తృణముల్ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కూడ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్తి విజయం సాధించాడు.ఈ ఉప ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలిచింది.తమిళనాడు నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి ఎరుకయినదే,మహారాష్ట్ర లోను రాహుల్ జోడో యాత్ర జరిగింది.అయితే తెలంగాణ లోను రాహుల్ యాత్ర జరిగినప్పటికి,అదే సందర్భంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయింది.ఇక్కడ అభ్యర్థి 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచి,రాజీనామా చేసి బీజేపీ లో చేరడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది.అయితే అతను బీజేపీ నుంచి పోటీ చేసినప్పటికి బిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు.బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ ఓడిపోయారు.నిజానికి త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో,నాగాలాండ్,మేఘాలయ  ఎన్నికల కు సంబంధించి ఇంచార్జిగా,కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన ప్రస్తుత అస్సాం సీఎం హిమంతా బిస్వా శర్మ ఉన్నారు.అయినా ఫలితాలు రాలేదు.పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు భారీగా పార్టీ లు మారారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బీజేపీ,తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోవడం గడచిన ఎనిమిది ఏండ్లలో చాలా చూసాము.గోవా లో అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బీజేపీ లో చేరి పోయారు.ఇందులో ఒక మాజీ సీఎం కూడ ఉన్నాడు.మధ్య ప్రదేశ్ లో ఇదే జరిగింది.ప్రముఖ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత మాధవ్ రావ్ సిందియా కుమారుడు జ్యోతి రాధిత్య సింధియా కాంగ్రెస్ ఎమ్మెల్యే లను చీల్చి,బీజేపీ లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ను కూల గొట్టి,కేంద్ర మంత్రి అయ్యాడు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా చాలా చోట్ల చీలికలు జరిగాయి.మహారాష్ట్ర లో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కెసిఆర్ నేత్రుత్వంలోని బిఆర్ఎస్ పోటీకి సన్నాహాలు చేస్తున్నది.ఇంచార్జిలను కూడ నియమించారు.అంతే కాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీకి సిద్ధం అవుతున్నది బిఆర్ఎస్,ఇక్కడ జెడిఎస్ తో కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంది.కాంగ్రెస్,బీజేపీ ల తో ఎవరెవరు పొత్తు కుదురు తారో త్వరలో తెలుస్తుంది.మొత్తానికి ఈ ఏడాది జరిగిన,జరుగునున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సహా సౌత్ ఇండియాలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని,నానా యాగీ లు చేస్తున్నది. హోమ్ మంత్రి అమిత్ షా ఇదే పని మీద బిజీ ఉన్నారు.దేశంలో వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు,మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజానికి చాలా మందికి షాకింగ్,డిబేట్లు,చేసే వారు,చేసిన వారు,ఒపీనియన్ పోల్,లాంటి వాటి మీదనే నిరంతరం మాట్లాడే వారు,మీడియా తో ముచ్చటించే,పార్టీల నేతలు,కొందరు జర్నలిస్ట్ ల అభిప్రాయం,కూడ ఎలా ఉంటుందో చూద్దాం! ఎప్పుడు ఎన్నికల కోసమే కసరత్తు లు చేసే నేతలకు కూడ ఈ విషయం మింగుడు పడక పోవచ్చు,ఎందుకంటే నేల మీద నిజం కంటే ఎక్కువ వాళ్లు సోకాల్డ్ సర్వే లను నమ్ముతారు,సిక్త్ సెన్స్ తమేకే ఉందని భావిస్తారు.నిజం తక్కువ,అబద్దం ఎక్కువ రాజకీయాలే ఇప్పుడు నడుస్తున్నాయి కదా! నిజమే కదా! జో సచ్,సచ్ బోలతో,సచ్చాయి మార్గయి..జూట్ బోల్  నే వాలేకా హి హై జమానా!బాకీ కుచ్ బచాతో,బేరోజ్ గారి,ఔర్ మెహెంగాయి,మార్గయ్! పొలిటిషియన్ కో ఉస్కె,పదవి కి  చింతా మార్గయ్!....అబద్దం దే పై చేయి అవుతున్నది..నిజం అపహాస్యానికి గురి అవుతున్న రోజులువి,ప్రజాస్వామ్యం కు,రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు విలువలేదు!

ఎండి.మునీర్,

సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు

9951865223,