హింసకు ‘సుప్రీం’ వేదిక కాకూడదు

హింసకు ‘సుప్రీం’ వేదిక కాకూడదు
  • శాంతిభద్రతలను మా చేతులలోకి తీసుకోవడం కుదరదు
  • పరిస్థితులను చక్కదిద్దేందుకు సలహాలు, సూచనలు అందించాలి
  • స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

ఇంఫాల్: మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదంది. హింసను అరికట్టేందుకు శాంతిభద్రతలకు తమ చేతులలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. మణిపూర్ లో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులను మాత్రమే ఆదేశించగలమని తేల్చి చెప్పింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. మణిపూర్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు కొన్ని సానుకూల సలహాలు, సూచనలు అందించాలని సూచించింది. వాటిని కేంద్ర ప్రభుత్వం సహా మణిపూర్ ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని వివరించింది.