ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ‘జవాన్’

 ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ‘జవాన్’

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’. హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రివ్యూని జూలై 10 రోజున విడుద‌ల చేశారు. ఈ ప్రివ్యూ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. స‌మాజంలోని త‌ప్పుల‌న స‌రిదిద్దడానికి ఓ వ్యక్తి చేసే ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే జ‌వాన్ సినిమా అని ప్రివ్యూ చూస్తే అర్థమ‌వుతుంది. యాక్షన్ ప్యాక్డ్‌గా రూపొందిన జ‌వాన్ మూవీ ప్రివ్యూ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. భారీ విజువ‌ల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్షకుల‌ను మెస్మరైజ్ చేస్తుంది. ప్రేక్షకుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. యాక్షన్‌, ఎమోష‌న్స్ ప‌ర్‌ఫెక్ట్ కాంబినేష‌న్‌లో జ‌వాన్ అంద‌రినీ అల‌రిచంనుంద‌ని ప్రివ్యూలో చూపించారు. ప్రతి ఫ్రేమ్‌లో భారీత‌నం, గొప్ప విజువ‌ల్స్‌ను చూస్తుంటే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా సినిమా ఉంటుంద‌నిపిస్తుంది. జ‌వాన్ ప్రివ్యూని గ‌మ‌నిస్తే కింగ్ ఖాన్ షారూక్ వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభం అవుతుంది. ప్రతి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా షారూక్ ఖాన్ డిఫ‌రెంట్ లుక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంత‌కు ముందెన్నడూ చూడ‌ని విధంగా షారూక్ లుక్స్ ఉన్నాయి. షారూక్‌తో పాటు న‌య‌న తార, దీపికా ప‌దుకొనె, ప్రియ‌మ‌ణి వంటి భారీ తారాగ‌ణం.. సినిమాలో భారీ విస్పోట‌న స‌న్నివేశాలతో రూపొందిన యాక్షన్ సీక్వెన్స్‌, గ్రాండ్ స్కేల్‌లో తెర‌కెక్కిన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ‘ఈ మౌనం, ఈ బిడియం...’  రెట్రో సాంగ్‌లో షారూ క్ పెర్ఫామెన్స్ మెప్పిస్తోంది.