‘టైగర్ నాగేశ్వరరావు’  ది పెప్పీయెస్ట్ సాంగ్ 

‘టైగర్ నాగేశ్వరరావు’  ది పెప్పీయెస్ట్ సాంగ్ 


 రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ భారతదేశంలోని అతిపెద్ద దొంగ ఇన్ ఫేమస్ యాక్ట్స్ గురించి మాత్రమే కాదు అతని జీవితంలోని ఇతర కోణాలను ప్రజెంట్ చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేశారు.  ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లను గ్రాండ్ గా ప్రారంభించారు. ’ఏక్ దమ్ ఏక్ దమ్' పాట  పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవనుంది. ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్ పల్స్‌ తెలిసిన కంపోజర్స్ లో జివి ప్రకాష్ కుమార్ ఒకరు. ఏక్ దమ్ ఏక్ దమ్ పాటలో డ్యాన్స్ రిథమ్స్ ఎక్స్ ట్రార్డినరిగా వున్నాయి. జివి తన ఇన్‌స్ట్రుమెంటేషన్, కంపోజిషన్ తో పాటకు రెట్రో అనుభూతిని తెచ్చారు. భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా అలపించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే ఎలక్ట్రిఫైయింగ్, ట్రెండీ హుక్ స్టెప్‌ను క్రియేట్ చేశారు.