'800' ట్రైలర్ ఆవిష్కరణలో సచిన్

'800' ట్రైలర్ ఆవిష్కరణలో సచిన్


టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ముంబైలో  సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.  సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్ కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తొలిసారి మురళీధరన్ ని కలిశా. అప్పటి నుంచి మా మధ్య స్నేహం అలాగే ఉంది. లాస్ట్ మంత్ యూనిసెఫ్ వర్క్ మీద నేను శ్రీలంక వెళ్ళా. అప్పుడు మురళీధరన్ కి మెసేజ్ చేశా... 'నేను మీ సిటీలో ఉన్నాను' అని! 'అక్కడ ఏం చేస్తున్నావ్. నేను భారత్ లో ఉన్నాను' అని రిప్లై ఇచ్చాడు. తర్వాత బయోపిక్ గురించి చెప్పాడు. ఈ ఈవెంట్ కి రాగలవా? అని అడిగాడు. మురళీధరన్ ఎంతో సాధించాడు. అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు. పిచ్ ఎలా ఉన్నా సరే మురళీధరన్ బంతిని టర్న్ చేయగలడు.