“రామన్న యూత్” ట్రైలర్ విడుదల

“రామన్న యూత్” ట్రైలర్ విడుదల


టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన “రామన్న యూత్” సినిమా ట్రైలర్ బాగుందన్న హీరో సిద్ధార్థ్ ..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా హీరో సిద్దార్ధ్  మాట్లాడుతూ - “రామన్న యూత్” టైటిల్ క్యాచీగా ఉంది. అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింలో అభయ్ యాక్టింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. తరుణ్ కు ఫోన్ చేసి మాట్లాడా. అభయ్ లో మంచి యాక్టర్, రైటర్ ఉన్నాడని చెప్పాడు. తర్వాత నా చిన్నా సినిమాలో ఓ కీ రోల్ అభయ్ చేశాడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తను లైఫ్ లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్ చూశాను ఫన్ ఉంది. అలాగే ఫన్ వెనక ఒక ఎమోషన్ ఉంది. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నా అన్నారు.