దిల్‌రాజు ప్యానల్‌ ఘనవిజయం

దిల్‌రాజు ప్యానల్‌ ఘనవిజయం

ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. టీపీసీసీ అధ్యక్ష బరిలో నిర్మాతలు సి. కల్యాణ్, దిల్ రాజు నిలిచారు. దీంతో హోరాహోరీగా ఓటింగ్ జరిగింది. మొత్తం 1339 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1600 ఓట్లకు గాను 891. స్టూడియో సెక్టార్‌లో 98 ఓట్లకు గాను 68, డిస్టిబ్యూషన్‌ సెక్టార్‌ లో 597 గాను 380 ఓట్లు పోల్‌ అయ్యాయి. గతంలో లేని విధంగా ఈసారి రికార్డు స్థ్థాయిలో ఓట్లు పోల్‌ అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపొందింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ కైవసం చేసుకుంది .డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో రెండు ప్యానల్స్‌ నుంచి సీ.కళ్యాణ్, దిల్ రాజు సెంటర్ల నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు.

దిల్ రాజుతో పాటు ప్రసన్న కుమార్, వైవీ చౌదరి, అశోక్ కుమార్, పద్మిని, స్రవంతి రవికిషోర్, యలమంచలి రవిశంకర్, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి గెలుపొందారు. స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ నుంచి ఉన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు. వైస్‌ప్రెసిడెంట్‌గా ముత్యాలరామదాసు, కార్యదర్శిగా దామోదర్‌ ప్రసాద్‌, ట్రెజరర్‌గా ప్రసన్నకుమార్‌. మొత్తం 48 ఓట్లలో దిల్‌రాజుకి 31 ఓట్లు కైవసం చేసుకున్నారు.