ఆ ఇద్దరు అధికారులకు హైకోర్టులో ఊరట

ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్​ కృష్ణబాబు, ఐపీఎస్​ ద్వారకా తిరుమల రావుకు ఊరట కలిగింది. సింగిల్​ బెంచ్​ తీర్పుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కృష్ణబాబు, ద్వారకా తిరుమల రావుకు జైలు శిక్ష, జరిమానా విధించిన సింగిల్​ బెంచ్​. సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులను సస్పెండ్​ చేసిన హైకోర్టు. తదుపరి విచారణ జూన్​ 16కు వాయిదా పడింది.