అభ్యర్థుల భావిష్యత్తు ఈవిఎమ్ లలో నిక్షిప్తం..

అభ్యర్థుల భావిష్యత్తు ఈవిఎమ్ లలో నిక్షిప్తం..
  • స్ట్రాంగ్ రూమ్ లవద్ద భారీ బందోబస్తు
  • యూత్ఖంట లో పార్టీ క్యాడర్
  • ఎవరి ధీమా వారిదే

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: 2023 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పూర్తయ్యింది, ఈ నెల 3 న అభ్యర్థులు భవితవ్యం  బయటపడనుంది, ఆ యా పార్టీల నాయకులు కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది అయిన ఎవరి ధీమా వారికే ఉంది. గురువారం జరిగిన పోలింగ్ లో జిల్లాలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గం లో 87.51 శాతం ఓట్లు పోల్ కాగా,  అత్యల్పంగా సిద్దిపేటలో 76.33 శాతం ఓట్లు పోలయ్యాయి. 

పోలైన ఓట్ల వివరాలు....
సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 2,33,733 ఓట్లు ఉండగా, అందులో 1,78, 420 ఓట్లు పోల్ అయ్యాయి. 76.33 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులలో 1,15,346కి గాను 88, 673 ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మహిళలలో 1,18,317కి గాను 89, 710 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 మంది ఇతరులు ఉండగా 37 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,98,100 ఓట్లు ఉండగా, అందులో 1,73,366 ఓట్లు పోల్ అయ్యాయి. 87.51 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులలో  97,019కి గాను 85,551 ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మహిళలలో 1,01,081కి గాను 87, 815 ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,74,654 ఓట్లు ఉండగా, అందులో 2,31,086 ఓట్లు పోల్ అయ్యాయి. 84.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులలో 1,36,294కి గాను 1,15,892 ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మహిళలలో 1,38, 353కి గాను 1,15,191 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 7 మంది ఇతరులు ఉండగా ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,42,182 ఓట్లు ఉండగా, అందులో 2,04,999 ఓట్లు పోల్ అయ్యాయి. 84.66 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులలో 1,19,763కి గాను 1,01,898 ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మహిళలలో 1,22,415కి గాను 1,03,100 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 మంది ఇతరులు ఉండగా ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఈవీఎంలలో ఫలితాలు నిక్షిప్తం...
ఈ వియంలో అభ్యర్థుల ఫలితాలను ఓటరు నిక్షిప్తం చేసి ఉంచారు. ఈ నెల మూడున ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్ లను కౌంటింగ్ కోసం అధికారులు సిద్ధం చేశారు. మొత్తం ఫలితాలు 22 రౌండ్ లలో వస్తాయని తెలిపారీ. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎవరికి వారే ధీమా.....
గెలుపు పై పోటీలో ఉన్న అభ్యర్థులలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తామే గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ,  కాదు తామే హైట్రిక్ గెలుపు సాధిస్తామని బిఆర్ఎస్ నాయకులు ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. ఎవరికి పట్టం కట్టనున్నారో.... ఎవరు గెలుస్తారు... మూడో తేదీ నాటి వరకు వేచి చూడాల్సిందే.