దుబ్బాకలో సైబర్ నేరం

దుబ్బాకలో సైబర్ నేరం

 డ్రెస్ సరఫరా పేరుతో 80 వేల రూపాయలు తస్కరించిన నేరగాడు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితురాలు సైబర్ మోసగాని మాటలు నమ్మి 80,893 రూపాయలు చెల్లించి మోసపోయిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఇంస్టాగ్రామ్ లో డ్రెస్ కు సంబంధించిన యాడ్ చూసి ఆర్డర్ చేసి ఆర్డర్ పై అమౌంట్ చెల్లించింది. తదుపరి గుర్తుతెలియని సైబర్ నేరస్తుడు ఆమెకు వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు.

పార్సల్ డెలివరీ గురించి ఇంకా డబ్బులు చెల్లించాలని చెల్లించకపోతే మీరు ఆర్డర్ చేసిన డ్రెస్ పార్సల్ డెలివరీ కాదని చెప్పగానే అది నమ్మిన బాధితురాలు సైబర్ నేరగాడు పంపించిన నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే,ద్వారా 80, 893రూపాయలు పంపించింది.పార్సల్ డెలివరీ కానందున వాట్సప్ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గమనించిన బాధితురాలు వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేసిందని సిపి తెలిపారు.