సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
  • సిద్దిపేట సిపి ఎన్.శ్వేత  ప్రకటన విడుదల 

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో  సిటీ  పోలీస్ యాక్టు ఈ నెల 6 నుండి 13 ఉదయం 6 గంటల వరకు  ఆమలులో వుంటుందని పోలీసు కమిషనర్  ఎన్.శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు,సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రకటించారు.ఒక వేళ ఆ కార్యక్రమాల నిర్వహణ అత్యవసరంగా చేయాలని అనుకునే వారు ముందుగా పోలీస్  అధికారుల అనుమతి  తీసుకోవాలని సూచించారు.బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి,బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

 డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు కూడా ఈ నెల 6 వ తేదీ నుంచి 13 వ తేదీన ఉదయం 6 గంటల అమల్లో ఉంటాయని సిపి ఎన్. శ్వేత తెలిపారు.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (A), 45db (A), 65db (A), 30 పోలీస్ యాక్ట్ 1961,రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.చిన్నపిల్లలు, వృద్ధులు,రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై  నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు.  నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 IPC, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1961 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్.శ్వేత తెలిపారు.