శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచలం ముత్యాల తలంబ్రాల పంపిణీ

శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచలం ముత్యాల తలంబ్రాల పంపిణీ

సిద్దిపేట ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మహాలక్ష్మి హోమ్స్ లో శనివారం నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ అధ్యక్షతన భద్రాచల ముత్యాల తలంబ్రాల ను పంపిణీ చేశారు.  శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో  ఇటీవల కోటి గోటి తలంబ్రాలు ఒలిచి భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణంకు అందజేసి మళ్ళీ గజ్వేల్ కు వంద కిలోల తలంబ్రాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే రామకోటి నామాలను  లింకింపజేస్తూ మరో రామదాసుగా గుర్తింపు తెచ్చుకున్న రామకోటి రామరాజు భద్రాచలం తలంబ్రాలు తీసుకువచ్చి భక్తులకు అంద జేయడం అభినందనీయం అని నాచారం దేవస్థానం బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు.

కాశీ నుండి తీసుకొచ్చిన రుద్రాక్షమాలతో రామకోటి రామరాజును ఈ సందర్భంగా సన్మానించారు. ముత్యాల తలంబ్రాలను తీసుకున్న మహిళా భక్తులు మాట్లాడుతూ భద్రాచల తలంబ్రాలు మాకు అందడం ఎన్ని జన్మల పుణ్యఫలమో అని తమ ఆనందాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నందు పంతులు, సిద్ది బిక్షపతి, అయిత సత్యనారాయణ, దూబకుంట మెట్రాములు, దొంతుల సత్య నారాయణ,  కైలాస ప్రశాంత్, శ్రీహరి, సంతోష్, కృష్ణమూర్తి, అంజయ్య, మంగలపల్లి హనుమంతు ఆర్యవైశ్య నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.