చిన్నకోడూరులో ముస్లింలకు దుస్తుల పంపిణీ

చిన్నకోడూరులో ముస్లింలకు దుస్తుల పంపిణీ

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ తెలిపారు.

ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ముస్లిం సోదరులకు బట్టలు పంపిణీ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు అందరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ముస్లింల కోసం ప్రభుత్వం మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి ,సర్పంచ్ల పోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, రైతు సమన్వయ జిల్లా సభ్యులు వెంకటేశం, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపురం సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య పాల్గొన్నారు.