కూలి ఫైకం ప్రభుత్వానిది... పనులేమో జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో

కూలి ఫైకం ప్రభుత్వానిది... పనులేమో జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కూలి డబ్బులు తీసుకునేది ప్రభుత్వం వద్ద, పని చేపించేది మాత్రం ప్రైవేట్ భవనాలలో ... ఇది జగిత్యాల మున్సిపల్ అధికారుల తీరు. జగిత్యాల పట్టణంలో నాటిన మొక్కలను పరిరక్షించేదుకు మున్సిపల్ అధికారులు కాంట్రాక్ట్ ద్వారా 35  మంది కూలీలను సమకూర్చుకున్నారు. ఇందులో వాచ్ అన్ వార్డ్స్ 20, వన సేవకులుగా 15 మంది రోజు విధులు నిర్వహిస్తుంటారు. వన సేవకులు 15 మంది జగిత్యాల పట్టణంలోని పిల్టర్ బెడ్, విద్యానగర్ టీవీ స్టేషన్, అచ్చుబండ పోచమ్మ, టిఆర్ నగర్ లలో గల నర్సరీలలో పని చేస్తారు. 20 మంది వాచ్ అన్ వార్డ్స్ గా పట్టణంలో నాటిన మొక్కలను సంరక్షించడం, నీరు పోయడం, కలుపు తీయడం, కటింగ్, బిడింగ్ చేయడం లాంటి పనులు నిత్యం చేస్తుంటారు.


జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్విపర్లుగా హరిత కూలీలు
జగిత్యాల పట్టణంలోని మొక్కలను రక్షించే పనులు చేయాల్సిన మున్సిపల్ హరిత కూలీలు జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యలయంలో స్విపర్లుగా మారారు. జగిత్యాల మండలం అంతర్ గాంకు చెందిన 9 మంది మహిళలు జగిత్యాల మున్సిపల్ లో హరిత హారం విబాగంలో కంట్రాక్టర్ ద్వారా కూలీలుగా పని చేస్తారు. రోజులాగే జగిత్యాల పట్టణంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన 9 మంది మహిళ హరిత కూలీలలో 5గురు కరీంనగర్ రోడ్దులో ఉన్న అమరవీరుల స్మృతి వనంలో పనులు చేస్తుండగా, 4 మహిళ కూలీలు దరూరు క్యాంపులోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్విపర్లుగా మారి కార్యాలయ ఆవరణలో పేరుకు పాయిన చెంతను ఉడ్చి వేశారు. 50 ఏళ్ల మామిడి చెట్టు కొమ్మ విరిగి పడి ఉండగా ఇబ్బంది పడుతూ ఆ కొమ్మను మహిళ కూలీలు బయటకు తీసుకు వచ్చి పడవేశారు. సుమారు ఎకరంన్నర వరకు ఉన్న కార్యాలయ ప్రాంగణాన్ని ఉడ్చి చెత్త తొలగించే సరికి వారికి రోజు గడిచి పోయింది. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ హరిత కూలీలతో పనులు చేయించడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 2వ వార్డులలో చెత్త తొలగించడం లేదని, మురికి కాలువలు తీయడం లేదని స్వయంగా కౌన్సిలర్ ప్రజావానిలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడాన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది పట్టణ పరిస్థితి ఎలా ఉందో. కలెక్టర్ కు పిర్యాదు చేసిన స్పందించని అధికారులు ఇలా మున్సిపల్ కూలీలతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలో పనులు చేయించడంఫై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  మున్సిపల్ కూలీలను వినియోగిడం ఇది మొదటి సారి ఏమి కాదని నిత్యం ఇలానే జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  ఇకనైన మున్సిపల్ అధికారులు వార్డు సమస్యలఫై ద్రుష్టి పెట్టి, ఇలా మున్సిపల్  కూలీలను ప్రైవేట్ పనులకు ఉపయోగించకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలేగే హరిత కూలీలను ప్రైవేట్ పనులకు పంపిన అధికారిఫై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.