పాలీసెట్ పరీక్ష ప్రశాంతం

పాలీసెట్ పరీక్ష ప్రశాంతం
  • 175 విద్యార్థులు గైర్హాజరు
  • నిమిషం లేటుతో విద్యార్థినిని అనుమతించని అధికారులు 

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో పిల 3622 విద్యార్థులకు 175 మంది విద్యార్థులు గైరాజరవగా 3447 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జగిత్యాల పట్టణంలో 7  పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2245 మంది విద్యార్థులకు 103 గైరాజరవగా 2142 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కోరుట్లలో 1377 మంది విద్యార్థులకు 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 72 మంది విద్యార్థులు గైరాజరవగా 1305 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
నిమిషం లేటుతో రోధిస్తూ వెనుదిరిగిన విద్యార్థి..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పాలిసెట్ పరీక్ష కేంద్రంలో ధర్మపురి  మండలం గుండయ్య పల్లికి చెందిన భూపతి అర్చన అనే విద్యార్థిని ఒక నిమిషం లేటుగా వచ్చింది. దీంతో లేటుగా వచ్చిన విద్యార్థిని అధికారులు ఉపాధ్యాయులు అనుమతించలేదు. విద్యార్థి తల్లిదండ్రులు వేడుకున్న అనుమతించకపోవడంతో అర్చన రోధిస్తూ వెనిదిరిగింది