రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

సారంగాపూర్ ముద్ర:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సారంగాపూర్ ,బీర్పూర్ మండల కేంద్రంల్లోనీ ప్రధాన రహదారిపై  బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటు సరఫరా సరిపోతుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయగా టిఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ బీర్పూర్ మండలాల టిఆర్ఎస్ అధ్యక్షులు నారపాక రమేష్ ,గుర్రాల రాజేందర్రెడ్డి నాయకులు ముప్పాళ్ళ రామచంద్రరావు,ఏలేటి నర్సింహారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.