ఘనంగా జెండా పండుగ

ఘనంగా జెండా పండుగ

ముద్ర, మల్యాల: తెలంగాణ అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మల్యాలలో సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జెండా ఎగురవేసి, పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గుండేటి రవీందర్, ఉపసర్పంచ్ పోతారాజు శ్రీనివాస్, రైతు సమితి అధ్యక్షులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ఎల్లాల జనార్దన్ రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆసం శివ, బొల్లారపు నరేష్, జవ్వాజి శ్రీనివాస్, యాగండ్ల సుమన్, తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా, ముత్యంపేట గ్రామంలో జెండా పండుగలో భాగంగా వైకుంఠధామాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ త్రినాథ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.