ఔరంగజేబు జుట్టు పని వేస్తే కేసీఆర్ ది ఎసిడి పన్ను..

ఔరంగజేబు జుట్టు పని వేస్తే కేసీఆర్ ది ఎసిడి పన్ను..
KCR will pay the ACD tax jeevan reddy fire on kcr

24 గంటల విద్యుత్ వస్తే ప్రజా జీవితంలో నుంచి తప్పకుఉంటా... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణలో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్ సప్లై ఇస్తున్నట్లయితే నేను ప్రజా జీవితంలో నుంచి తప్పుకుంటానని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పట్టణం లోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులకు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదని, రైతులు వ్యవసాయ పంపులద్దే సంసారం చేసే పరిస్థితి వచ్చింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ ఏసిడి బిల్ తీసుకోవచ్చారన్నారు. నాడు ఔరంగాజే జుట్టు పని వేస్తే ఇప్పుడు కేసీఆర్ ఏసీడీ పన్ను వేస్తున్నారని ఎద్దేవా చేశారు. 300 యూనిట్లు లోపల ఉన్న  నిరుపేద వర్గాలైన వారిపై పన్ను వేస్తున్నారని, ఇది ఒక ఎన్పీడీసీఎల్ లో మాత్రమే ఉందని ఉత్తర తెలంగాణ వినియోగదారులు తెలంగాణ బిడ్డలు కాదా అని తాము ఉద్యమం చేయలేదా అని ప్రశ్నించారు.

దక్షిణ తెలంగాణలో ఎసిడి చార్జీలు లేవని కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గజ్జేవేల్లిలో లేదని ఆయన కొడుకు  కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎసిడి బిల్లు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.రాష్ట్రంలో 110 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించలేనీ అసమర్థుడు కేసీఆర్ అని అన్నారు. ఈ నెల 31న విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల ఎస్ ఈ  కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.

పసుపు బోర్డు లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానన్న అరవింద్ సాధించలేకపోయాడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెట్టు వేసుకోవడం తప్ప రైతుల సమస్యలు పరిష్కరించింది లేదన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని,  అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే ఎంపీ దేనికైనా పోటీ చేసెందుకు సిద్ధం అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మెన్ గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి  విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి,  బండ శంకర్, గాజంగీ నందయ్య, గాజుల రాజేందర్, రమేష్ రావు,పుప్పాల అశోక్, రాధా కిషన్, మున్న, చాంద్ పాషా, బీర్పుర్ ఎంపీపీ మసర్తి రమేష్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.