ఏ ఒక్క చిన్న తప్పిదం లేకుండా....

ఏ ఒక్క చిన్న తప్పిదం లేకుండా....
  • పదవ  తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.
  • -అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా చూడాలి
  • - మాన్యువల్ లోని నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలి
  • - సమయపాలన పాటించాలి
  • - ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోని అనుమతించవద్దు
  • - బయటి వాళ్ళను ఎవ్వరినీ అనుమతించవద్దు
  • - సజావుగా పరీక్షలు జరిగేలా చూడాలి
  • - జిల్లా కలెక్టర్  షేక్ యస్మిన్ భాష.  

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  పదవ తరగతి పరీక్షలు పకడ్బంది ఏర్పాట్లపై బుధవారం విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా వివిధ సంబంధిత విభాగాల అధికారులకు తగిన సూచనలు చేసారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు తగిన ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుండి 13 వరకు నిర్వహించబడునని ఈ పరీక్షలకు 5747బాలురు, 5430 బాలికలు,  మొత్తము 11177 విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కొరకు 68 రెగ్యులర్ విద్యార్థులకు, ఒకటి ప్రైవేట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ ఒక్క చిన్న తప్పిదం లేకుండా.పదవ  తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

మాన్యువల్ లోని నిబంధనలు, సమయపాలన పాటించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోని అనుమతించవద్దని, బయటి వాళ్ళను ఎవ్వరినీ అనుమతించకుండ సజావుగా పరీక్షలు జరిగేలా చూడాలని అదేశించారు. పరీక్షల నిర్వహణకు 69 చీఫ్ సూపర్డెంట్లు,  69 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 3 ముగ్గురు అదనపు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 420 ప్లయింగ్ స్క్వాడ్, 980 ఇనివిజిలేటర్స్ నియమించారు. పరీక్ష కేంద్రాలలో సి ఎస్  గదిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయగా ప్రతి పరీక్షకేంద్రములో విద్యార్థులు సౌకర్యముగా పరీక్షలు వ్రాయడానికి డుయల్ డెస్క్ , ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. పరీక్ష సమయములో విద్యార్థులకు మంచినీటి, వైద్య సేవలు సకాలంలో అవసరమైనచో అందించడానికి మెడికల్ కిట్ తో ఒక ఎఎన్ ఎంను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో మండల, జిల్లా అధికారుల ఫోన్ నెంబర్లు ఏర్పాటు.

ఈ సంవత్సరము కూడా పదవ తరగతికి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతిరోజు పరీక్ష కేంద్రమునకు ఉదయం 8:30 గంటలకు చేరుకోవాలి. పరీక్ష గదిలోకి 9 గంటలకు అనుమతించబడును. పరీక్ష ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటలకు వరకు నిర్వహించబడును. కాంపోజిట్ కోర్సు తెలుగు కు సంబంధించిన పరీక్ష కాలవ్యవధి 9:30 am నుండి 12:50 pm వరకు నిర్వహించబడును. కాంపోజిట్ కోర్సు 03Tకి సంబంధించి పరీక్ష కాలము 9:30 నుండి 11:30 వరకు ఉండును. 11:30 నుండి 11:50 వరకు 03T యొక్క జవాబు పత్రములు: తీసుకోవడము సంస్కృతము (45) కు సంబంధించిన ఓఎంఆర్  షీట్స్ ఇవ్వడం. (45) పరీక్ష కాలవ్యవధి 11:50 నుండి 150 వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అగ్గడి భాస్కర్, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా విద్యాధికారి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.