భద్రాద్రి బందోబస్తులో తండ్రి కూతురు

భద్రాద్రి బందోబస్తులో తండ్రి కూతురు

ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. ఈ నెల ముప్పైన  గురువారం భద్రాద్రిలో జరుగనున్న శ్రీ సీత రాముల కళ్యాణం జరుగనుండగ బందో బస్తులో బాగంగా ఒకే చోట తండ్రి కూతుళ్లకు డ్యూటీ పడటంతో ఆనందం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్య నారాయణ, అతని కూతురు కరీంనగర్ షి టీమ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

శ్రీసీతారాముల కళ్యాణం పురస్కరించుకొని భద్రాద్రిలో బందోబస్తు సందర్భంగా తండ్రి కూతురికి ఒక దగ్గర డ్యూటీ ఇవ్వడంతో వారిద్దరూ అక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.తోటి సిబ్బంది వారిని చూసి చాలా గర్వంగా ఉందని తెలిపారు.ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ లో పోలీస్ శాఖలో విధులు నిర్వహించటం,ఒకే దగ్గర బందోబస్తులో కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.తండ్రి కూతురుకు ఒకే దగ్గర డ్యూటీ పడటం ఇప్పటివరకు ఎన్నడూ చూడలేదని,అధికారులు ఆనందపడుతున్నారు.