ఆల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఆల్ ఇండియా యూనివర్సిటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
All India District Athletes for University Wrestling Championship Competitions

ముద్ర, కొత్తగూడెం: ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు మహారాష్ట్రలోని కొలాపూర్ లో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీ  రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎంపికైన క్రీడాకారులు.ఎస్ వినయ్ కుమార్ 85 కేజీలు ఫ్రీ స్టైల్ విభాగము, కే .నవీన్ 79 కేజీల  ఫ్రీ స్టైల్ విభాగము,వై. జంపన్న 74 కేజీల ఫ్రీ స్టైల్ విభాగములో,  క్రీడాకారులు ఎంపికయ్యారు. గత నెల 17వ తేదీన వరంగల్ లో జరిగిన యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పలు విభాగాలలో జరిగిన రెజ్లింగ్ పోటీలలో తలపడి అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం పొంది  జాతీయస్థాయి పోటీలకు అర్హత  సాధించారు, గతంలో కూడా వీరు పలు రాష్ట్ర ,జాతీయస్థాయి పోటీలలో, పాల్గొని అనేక పథకాలు బహుమతులు గెలుపొందారు,  ప్రస్తుతం ఈ క్రీడాకారులు ప్రత్యేక శిక్షణలో ఉన్నారు  వీరు 19వ తేదీ నాడు బయలుదేరి పోటీలకు వెళ్ళనున్నారు. జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ కాపుకృష్ణ, అధ్యక్షులు టీ. దామోదర్, ఉపాధ్యక్షులు గుగులోతు కృష్ణ, ప్రధాన కార్యదర్శి.    పి. కాశీ హుస్సేన్, ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ లు హర్షం వ్యక్తం చేశారు.