ఐఎఫ్టియు  రాష్ట్ర కమిటీ ఎన్నిక

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర నూతన కమిటీని ఎంపిక చేసినట్లు ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం రైటర్ బస్తీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. రానున్న రెండుఏళ్ళు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించడానికి 23 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్రఅధ్యక్షుడిగా ఆరెల్లి కృష్ణ ,  ఉపాధ్యక్షులుగా  జె.సీతారామయ్య,  జి.అనురాధ, కె.విశ్వనాథ్ , ప్రధాన కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్, కార్యదర్శులుగా ఎండి.

రాషుద్దీన్, పి.శివబాబు, ఎస్.శ్రీధర్, కోశాధికారిగా పి.వరదయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కే.స్వామి, ఎల్.విశ్వనాథం,బి. రామ్ సింగ్ ఏపూరి వీరభద్రం, ఎస్.కె మదారసాహెబ్, . రాజేందర్ ,మేకల రామయ్య, జి. నాగయ్యలను ఎన్నుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్.ఉపేందర్ రావు, ఇఫ్టు రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆరేల్లి కృష్ణ,ఎం. శ్రీనివాస్,ఉపాధ్యక్షులు జే.సీతా రామయ్య,జి.అనురాధ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్.విశ్వనాథం,L.మారుతిరావు,హలిముద్దిన్ తదితరులు పాల్గొన్నారు.