సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం

సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం
BRS District President Rega Kantha Rao
  • సింగరేణి పరిరక్షణకు అందరూ కదిలి రండి
  • నేడు కొత్తగూడెం లో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయండి
  •  బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు 

ముద్ర ప్రతినిధి,భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణకే తలమానికంగా నిలిచి వెలుగు జిలుగుల సింగరేణిని చిమ్మ చీకటిగా మార్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సింగరేణి పరిరక్షణ కోసం భావితరాల భవిష్యత్తు కోసం సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు పండుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆబాస్పాలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బదనాం  చేయాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని మోడీ అనేక జిమ్ముక్కులాడుతున్నారని ఎద్దేవా చేశారు.  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడానికి కుట్రపన్నిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, రాకుండా అడుగడుగున అడ్డు తగులుతూనే ఉన్నారని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డంగా దొరికిపోయిన బిజెపి దొంగలు వారి బుద్ధి మారక ముందే విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటమాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో మరోసారి బిజెపి కేటుగాళ్లు అడ్డంగా దొరికిపోయారని అన్నారు.  ఇటీవల కాలంలో ఎరువుల ఫ్యాక్టరీ కి ప్రారంభోత్సవానికి రామగుండం ఏరియాలో పర్యటించిన ప్రధాని మోడీ సింగరేణి విషయంలో 51% వాటా అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బావుల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థలకే ఇస్తామని మాట ఇచ్చిన ప్రధాని మోడీ మాట తప్పారని ఈ విషయంలో తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే వనమా  వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
మోడీ హటావో సింగరేణి బచావో అంటూ నినదించారు. శనివారం జరపతని పెట్టిన మహాధర్నా కార్యక్రమంలో కొత్తగూడెం అంబేద్కర్ సెంటర్ సాక్షిగా ప్రధాని మోడీ హటావో సింగరేణి బచావో నినాధాన్ని కేంద్ర ప్రభుత్వం విని దిగివచ్చేలా ప్రతి ఒక్కరు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని  పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు... ఎమ్మెల్సీ తాతా మధు కేంద్రంలో నరేంద్ర మోడీ సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని మూడు కోట్ల తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాన్ని ప్రధాని మోడీ ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోమని మహాధర్నాతో సింగరేణి పరిరక్షించుకుంటామని ఎమ్మెల్సీ తాత మధు స్పష్టం చేశారు.

తెలంగాణ ఆస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుండు.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
సింగరేణి సమాజాన్ని సింగరేణి మనుగడను పెను ప్రమాదంలోకి నెట్టేందుకు దేశ ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఆస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బొగ్గు భావన ప్రైవేటీకరణను ప్రధాని మోడీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ధ్వజమెత్తారు. కొత్తగూడెంలో జరిగే మహా ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు సింగరేణి కార్మికులు బిఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని అన్నారు.. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు బి వెంకట్రావు, నాయకులు లావుడియా గిరిబాబు జెవిఎస్ చౌదరి మోరే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.