Hath Se Jodo Yatra తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి

Hath Se Jodo Yatra తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి
Get rid of Telangana traitors says tpcc revanth reddy
  • తెలంగాణ ద్రోహులను పారదోలండి
  • టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి, ఆదరించాలని అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హాత్ సే జోడో యాత్రలో భాగంగా శనివారం యాత్ర ఇల్లందు చేరింది. ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అవకాశం కల్పించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

స్వరాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి రాను ఎన్నికల్లో గెలిపించి ఒక అవకాశం కల్పించాలని కోరారు. ప్రజా సంక్షేమం పార్టీతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసనులలోనే సింగరేణి సంస్థలొ అవినీతి రాజ్యం ఏలుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం సింగరేణి సంస్థలు జరిగిన దోపిడీపై విచారించే ఫైల్ పైనే పెడతామన్నారు. సింగరేణి సంస్థలో దోపిడీకి పాల్పడిన ఎవ్వరిని విడిచి పెట్టేది లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని పిలుపునిచ్చారు.