ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో టిఆర్ఎస్ జండా ఎగురవేస్తాం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో టిఆర్ఎస్ జండా ఎగురవేస్తాం
  •  బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం
  •  బిజెపి, కాంగ్రెస్ పార్టీల మాటలన్నీ అబద్ధాలే
  • విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సమిష్టిగా పనిచేసి రానున్న ఎన్నికల్లో బీ ఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొడతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. సోమవారం  జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా తాను నియమించబడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న నిర్ణయాలు  చారిత్రాత్మకంగా మిగిలాయి అన్నారు.

పార్టీ విధివిధానాలను గ్రామస్థాయి వరకు తీసుకు వెళ్లేందుకు జిల్లాలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు గ్రామ మండల పార్టీ నాయకులు కూడా ఎంతో కష్టపడాలని అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బిజెపి కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు..బి ఆర్ ఎస్ కు వెన్ను దండుగా ఉండే కార్యకర్తలు ఎంతో కీలకమని తప్పకుండా వారు సైనికులుగా పనిచేసే మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. పార్టీ విధివిధానాలు, సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గానికి చేరే విధంగా అయా నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో  ప్రభుత్వ విప్ అదేగా కాంతారావు,ఎమ్మెల్సీ తాత మధు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట ఇల్లందు ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం , ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్  లు కాపు సీత లక్ష్మి,  వెంకటేశ్వర్లు, ఎంపీపీ భూక్య సోనా తదితరులు పాల్గొన్నారు