కంటివెలుగు కార్యక్రమం నిర్వహణలో పకడ్బంది ఏర్పాట్లు..

కంటివెలుగు కార్యక్రమం నిర్వహణలో పకడ్బంది ఏర్పాట్లు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమం ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖమ్మంలో ప్రారంభించనున్నారని, తదుపరి మన జిల్లాలో 19వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్దేశించిన అన్ని కేంద్రాల్లో ఏక కాలంలో ప్రారంభించనున్నుట్లు చెప్పారు. కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రత్యేకంగా టీములును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 7.90 లక్షల మంది 18 సంవత్సరాలు పైబడిన వారున్నారని, వారందరికి కంటిపరీక్షలు నిర్వహించు విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమం నిర్వహణకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలకు నిర్దేశించిన ప్రకారం క్యాంపులు జరుగుతాయని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీలలో కంటివెలుగు టీములు పర్యటించి కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. 37 గ్రామీణ ప్రాంతాలలోను, 11 పట్టణ ప్రాంతాలలోను టీములు పర్యటిస్తాయని చెప్పారు. ఇవికాక అదనంగా రెండు టీములను అదనంగా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రతి పౌరుడికి కంటివెలుగు కార్యక్రమం ఉపయోగపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంటి వెలుగు చేపట్టినట్లు చెప్పారు. ఆధార్, రేషన్కార్డు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. రీడింగ్ సమస్య ఉన్న వారికి తక్షణమే కంటి అద్దాలు అక్కడికక్కడే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. నివారింపదగ అంధత్వ నివారణ కార్యక్రమమే కంటివెలుగు అని చెప్పారు. 100 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉన్నందున ఆ ప్రకారం కార్యక్రమం నిర్వహణకు షెడ్యూలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాకు 45 వేలు కంటి అద్దాలు సరఫరా చేసియున్నారని చెప్పారు. రీటింగ్ అర్థాలు కాకుండా ఇతర సమస్యలున్న వారి వివరాలు నమోదు ప్రకారం 10 రోజుల్లో కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.