నేను రాజకీయాల్లోనే ఉన్నాను నా దృష్టిలో ప్రజా సేవే రాజకీయం: హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్

నేను రాజకీయాల్లోనే ఉన్నాను నా దృష్టిలో ప్రజా సేవే రాజకీయం: హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, విమర్శలకు తల పంచనని హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక సింగరేణి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహళా దినోత్సవం పురస్కరించుకొని డా. జీ ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్తగూడెం మహిళా శక్తి - మహిళా సాదికారత కార్యక్రమంలో బహుమతులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, అవార్డు గ్రహీతలు పాల్గొన్న ప్రతిఒక్క మహిళా మూర్తులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

డా. జీ ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కుట్టుమిషన్లు పంపిణీ, తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన బతుకమ్మ పండుగ నిర్వహణ, సంక్రాంతి పండుగ సందర్భంగా సెల్ఫీ విత్ రంగోలి అనే వినూత్న ముగ్గుల పోటీ నిర్వహించామని ఆయన గుర్తచేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, అనేకమంది మహిళలు కృషి చేస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని, వారి సేవలు గుర్తించి, వారిని గౌరవించి, మరిన్ని సేవలందించే విధంగా అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను  అని  అన్నారు.

చావు పుట్టుకలు మధ్య ఉన్న చిన్న ప్రయాణమే జీవితం, ఈ చిన్న జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుందనీ, అటువంటి సార్థకత చేకూర్చటంలో స్త్రీ పాత్ర అనన్య సామాన్య మైనదని ఆయన పేర్కొన్నారు. ప్రతి పురుషుడి విజయ వెనక మహిళా శక్తి ఉంటుంది నా ఎదుగుదలకు తోడ్పడుతూ నాకు ధైర్యాన్ని నింపింది తన తల్లి, చెల్లి, భార్య, బిడ్డ అని గుర్తు చేశారు. కొత్తగూడెం ప్రజానీకానికి మరీ ముఖ్యంగా మహిళలకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకునే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోననచనారు.ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, వాటికి అందరి సహకారం కావాలని కోరారు.