హిబ్స్ హఫీజ్ లను సన్మానించిన ఎమ్మెల్యే

హిబ్స్ హఫీజ్ లను సన్మానించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని మోహిన్ మొహాల్లాలోని  నయీ మజీద్ లోని మధర్సా ఏ ఇస్లామియా అరేబియా బైతులులుమ్ లో హిబ్స్ హాఫిజ్ లుగా విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, సన్మానించిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం  ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్. నేతృత్వంలో ముస్లిం మైనార్టీ సోదరులకు పెద్దపీట వేయడం జరిగినది. అన్ని వర్గాల మతాలతో సమానంగా ముస్లిం మతాన్ని కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో ముస్లిం మైనార్టీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలు ఉపయోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు కూడా చదువుకోవాలని మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ సోదరులు విదేశాల్లో చదువుకోడానికి వెళితే వారికి ప్రభుత్వ తరపున ప్రోత్సాహం వారికి ఆర్థికంగా కూడా అండగా నిలవడం జరిగింది.కేసీఆర్. అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ  హిందువుల పండగ దసరా బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీ సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేసి, బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది.

అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలో ఖురాన్ చదువుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని తెలిపారు. మైనార్టీ సోదరులు నిరుద్యోగులకు  ప్రభుత్వం తరఫున వాహనాలను అందజేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ రుణాలను అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మైనార్టీ సోదరులు మజీద్ లో ప్రార్థనలు నిర్వహించి వారికి గౌరవ వేతనం అందించిన. ఏకైక నాయకుడు కేసీఆర్. ని పేర్కొన్నారు.ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం భాయి భాయి అంటూ సోదర భావంతో ఉన్న మన మధ్య మతతత్వ పార్టీలు చిచ్చులు పెట్టడానికి  వస్తున్నారు. వారి మాటలను వారి కళ్ళు బోలి మాటలను నమ్మి మోసపోకండి తెలంగాణ రాష్ట్రం వల్లనే కెసిఆర్. నాయకత్వంలోనే మైనార్టీ సోదరులకు అభివృద్ధి సాధ్యమవుతుంది. అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా  గద్వాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పేద ముస్లిం మైనార్టీ సోదరులు వివాహ శుభకార్యాలు జరుపుకోవడానికి కమిటీ హాల్ నిర్మాణం చేయడం జరుగుతుంది.

అదేవిధంగా గద్వాల జిల్లా కేంద్రంలో కూడా ముస్లిం మైనార్టీ కమిటీ హాల్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈద్  నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్న త్వరగానే పూర్తి అయ్యే విధంగా సాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ చదివి విద్యార్థులు కేవలం ఉర్దూ మాత్రమే చదువుకుంటారు అనుకుంటా కానీ ఇంగ్లీషు కూడా చాలా చక్కగా మాట్లాడడం జరుగుతుంది ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ప్రపంచ దేశంలో ఎక్కడికెళ్లినా ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంచిగా ఇంగ్లీష్ భాషలో ఉపన్యాసంలో చెప్పడం జరిగింది ఈ విధంగా ఉర్దూ భవన్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, మున్సిపల్  వైస్ చైర్మన్ బాబర్, కె.టి దొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు,   బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సీసాల పాషా, మన్సుర్ , మోబిన్, రెహమాన్, ఫయాజ్, గద్వాల తిమ్మప్ప, కే ఫయాజ్,  ఉస్మాన్ మౌలానా, అబ్బాస్ మౌలానా, హాఫిజ్ అన్సార్,  మాజీద్ కమిటీ మెంబెర్స్  మాలిమ్ షబ్బీర్, మాలిల్ వాజీద్, మాలిమ్ కయ్యుమ్,ప్రిన్సిపాల్ జలీల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.