మోడీ.. గో బ్యాక్

మోడీ.. గో బ్యాక్
  • సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
  • కొత్తగూడెంలో  జరిగే మహా ధర్నాను జయప్రదం చేయండి
  • విలేకరుల సమావేశంలో టీబీజీకేస్ అధ్యక్షులు వెంకట్రావు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలు నిర్వీర్యం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న దేశ ప్రధాని మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని.. సింగరేణి బొగ్గు బావల ప్రైవేటీకరణకు ప్రయత్నం చేస్తున్న మోడీ ఆటలిక చెల్లవని సింగరేణి బొగ్గు బావుల విషయంపై మాటతప్పిన ప్రధాని మోడీకి కార్మికుల ఆగ్రహ జ్వాల తగులుతుందని.. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరప తలపెట్టిన మహా ధర్నాను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు బి వెంకటరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని టీబీజీకేస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో రామగుండం పర్యటనకు వచ్చిన దేశ ప్రధాని మోడీ సింగరేణి విషయంలో తాను ప్రైవేటీకరణకు వ్యతిరేకమని వాటాలో 51% ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి అప్పగిస్తామని మాటే ఇచ్చిన మోడీ నేడు మాట తప్పి ప్రైవేటీకరణకు పూనుకోవడం ప్రధాని మోడీ నియంతృత్వ పాలనకు నిదర్శనం అన్నారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపుమేరకు రాష్ట్రంలోని శ్రీరాంపూర్ భూపాలపల్లి కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ల వద్ద మహాధర్నాను చేపట్టామని ఈ ధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన జయప్రదం చేయాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24  భూగర్భ బావులు 18 భూ ఉపరితల బావులు ఉన్నాయని వీటిలో 43 వేల మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు దేశ ప్రధాని మోడీ వస్తున్న హైదరాబాద్ పర్యటనను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. గతంలో కొత్తగూడెంలోని కోయగూడెం సత్తుపల్లి లోని ఓసి మంచిర్యాలలోని శ్రావణపల్లి ఓసి కేకేఆర్ తదితర వాటికి వేలం వేశారని ఆ క్రమంలో టెండర్లను కూడా అడ్డుకొని కార్మికపక్షం ప్రత్యక్ష ఆందోళన కూడా చేపట్టిన సంగతి విధితమే అన్నారు. సింగరేణి సంస్థ మనుగడుకు ముప్పు వాటిల్లే విధంగా ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక తీసుకోకపోతే తెలంగాణ వాడిని వేడిని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకించి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నా కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరవుతారన్నారు. విలేకరుల సమావేశంలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, టీబీజీకేఎస్ కార్పొరేట్ ప్రెసిడెంట్ సోమిరెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కూసన వీరభద్రం, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, తదితరులు పాల్గొన్నారు.