పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు  మావోయిస్టు కార్యదర్శి ఆజాద్

పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు  మావోయిస్టు కార్యదర్శి ఆజాద్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భూ కబ్జాలకు పాల్పడుతున్న భద్రాచలం కు చెందిన పలువురు  రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు నేత ఆజాద్ హెచ్చరిస్తూ మంగళవారం లేఖను విడుదల చేశారు. భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏ మాట్లాడుతూ ఐటిడిఏ ప్రాంతంలోని సర్వేనెంబర్111/5లో నాలుగెకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రెవెన్యూ పోలీసుల సహాయంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, కొడాలి శ్రీనివాసరావు, రావులపల్లి రాంప్రసాదులు కబ్జా చేశారని ఆరోపించారు.

అదేవిధంగా రాజుపేట కాలనీలో  పాల్ రాజ్ స్థాపించిన క్రిస్టియన్ సంస్థలు చెందిన సర్వేనెంబర్ 522/2, 52/ 46, 53/ 32 లో గల మూడు ఎకరాల భూమిని సిపిఐ చెందిన రావులపల్లి రాంప్రసాద్ అక్రమంగా పట్టా చేయించుకున్నారని తెలిపారు. భూ కబ్జాకు పాల్పడిన నాయకులందరూ స్థానిక ఎమ్మెల్యేను  అడ్డం పెట్టుకొని జిల్లా మంత్రి బంధువులమంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పద్ధతుల్లో ఆదివాసీలు సాయుధ పోరాటాలునిర్వహించి వనరులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భూ పోరాటాలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని తెలిపారు.