అభివృద్ధే లక్ష్యం ఎమ్మెల్యే వనమా

అభివృద్ధే లక్ష్యం  ఎమ్మెల్యే వనమా

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పేద ప్రజల అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.గురువారం మున్సిపల్ పరిధిలోని  33 వ వార్డులో సుమారు కోటి రూపాయలతో  మున్సిపల్ కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ  చేశారు ‌.


ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానంలో భాగంగా రైతు బజార్ వ్యాపారస్తులకు ఇచ్చిన మాట నిలుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నానని, ఎవరేమనుకున్నా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపడమే తన లక్ష్యమని అన్నారు . కార్యక్రమంలో వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, గణేష్ టెంపుల్ చైర్మన్ శంకర్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఉర్దూఘార్ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు రావి మమత, బాలిశెట్టి సత్యభామ, కోలాపూర్ ధర్మరాజు, అంబుల వేణు, రుకుమెంధర్ బండారి, నాయకులు కాసుల వెంకట్, MA. రజాక్, రావి రాంబాబు, మసూద్, యూసూబ్  తదితరులు పాల్గొన్నారు.