ఎరుపెక్కిన కొత్తగూడెం

ఎరుపెక్కిన కొత్తగూడెం

శ్రమజీవుల పిడికిట్లో రెపరెప లాడిన ఎర్ర జెండాలు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కార్మిక సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల ప్రారంభ సందర్భంగా  కొత్తగూడెం ఎరుపెక్కింది.  ఆదివారం వందలాది మంది కార్మికులు కొత్తగూడెంలో భారీప్రదర్శన చేశారు. పట్టణంలోని పాత బస్ డిపో సూర్యోదయ విద్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన గణేష్ టెంపుల్,సూపర్ బజార్,రైల్వే స్టేషన్, అండర్ బ్రిడ్జి,బస్టాండ్ సెంటర్ల నుండి కొత్తగూడెం క్లబ్ కు చేరుకుంది.ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని 29 కార్మిక చట్టాల రద్దునుఉపసంహరించుకోవాలని నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని  హిందుత్వ బ్రాహ్మణీయ పాసిష్ఠ చర్యలను వ్యతిరేకించాలని బొగ్గు గనుల ప్రవేటీకరణను వ్యతిరేకించాలని ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 26 వేల వేతనం చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని,ప్రదర్శనలో కార్మికులు నినాదాలు చేశారు. ప్రదర్శనకు అగ్రభాగాన ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు,బెంగాల్ విప్లవ కార్మిక నాయకులు అమితాబ్, ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆరేల్లి కృష్ణ,ఎం. శ్రీనివాస్,ఉపాధ్యక్షులు జే. సీతారామయ్య, కార్యదర్శి జి. అనురాధ,కోశాధికారి ఎండి. రాసుద్దీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎల్.విశ్వనాథం తదితరులు అగ్రభాగాన ఉన్నారు.

 ప్రదర్శనలో అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వేణు,కార్యదర్శి నిర్మల కళాకారులు అనురాధ,జయసుధ నాగరాజు,శ్యాము,గణేశు తదితర కళాకారుల బృందంచే దారి పొడవున చేసిన సాంస్కృత ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అమరుడు Sk.ముక్తార్ పాష ప్రాంగణం(కొత్తగూడెం క్లబ్)లో అరెల్లి కృష్ణ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది.సభలో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు,ప్రొఫెసర్ కే. లక్ష్మీనారాయణ,బెంగాలీ విప్లవ కార్మికు ఉద్యమ నాయకులు అమితాబ్ ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని కేవలం ఆదాని,అంబానీ సంస్థలకు సీఈఓ గా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడని ఇందులో భాగమే దేశంలో ప్రజల సొమ్ముతో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న రైల్వే,బొగ్గు,ఆయిల్ ఎల్ఐసి,ఏర్పోర్ట్,ఎయిర్లైన్స్,డిఫెన్స్ తదితర దేశ సంపదలన్నిటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడని విమర్శించారు.

వందలాది సంవత్సరాలుగా కార్మికుల పోరాడి సాధించుకునే అనుభవిస్తున్న  29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని ఈ స్థానంలో నాలుగు లేబర్ కోడెలను తీసుకువచ్చిందని అన్నారు.కార్మిక వర్గం అనుభవిస్తున్న ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలు చేశారని,వేతనాల పెంపు కోసం కార్మికుల నిలదీసే అవకాశం, యూనియన్ పెట్టుకునే అధికారం సమ్మెచేసే హక్కు లాంటి వాటిని రద్దు చేశారని తెలిపారు.కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు మోడీ దేశాన్ని అచ్చేదినుగా చేశాడని 130 కోట్ల మంది దేశ ప్రజలకు కష్టతరమైన సచ్చేదిన్ మార్చాడని ఎద్దేవా చేశారు.బొగ్గు,గ్యాస్,డీజిల్ పెట్రోల్,నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి పెంచారని అన్నారు.ప్రజలకు సబ్సిడీని రద్దు చేస్తున్న పాలకులు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రుణాలు మాఫీని చేస్తున్నారని వారు తెలిపారు. సంపన్నుల దేశమని సామాన్యులకు దేశంలో మను గడలేదని పాలన చేస్తున్న ఆర్ఎస్ఎస్,బిజెపి బ్రాహ్మణియ హిందుత్వ మతోన్మాద పాసిస్ట్ చర్యలతో దేశాన్ని అధోగతికి నేడుతున్న పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అనేక వాగ్దానాలను కార్మికులకు చేశాడని అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చలేదని వారు అన్నారు. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను బానిస వ్యవస్థతో పోల్చిన కేసీఆర్ కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చాడని సింగరేణి,ఆర్టీసీ మున్సిపల్,గ్రామపంచాయతీ, రెవెన్యూ,వైద్య,విద్య,విద్యుత్ తదితర రంగాల్లో లక్షలాది మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వారిని పర్మినెంటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య, కార్యదర్శి జి.అనురాధ,కోశాధికారి ఎండి.రాసుద్దీన్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎల్.విశ్వనాథo ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.