ఘనంగా జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు
Celebrating National Girl Child Day

కొత్తగూడెం, (ముద్ర న్యూస్):  సమాజంలో అందరూ సమానమేనని, అమ్మాయిల పట్ల  వివక్ష చూపకూడదని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ  శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవ వేడుకలకు  ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు .బాలికల సంరక్షణ పై ఏర్పాటు చేసిన ప్లెడ్జి ఫ్లెక్సీపై సంతకం చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఆయన జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజం ఎంతో పురోగతి చెందిందని  ఆడపిల్ల పుడితే భారంగా భావించే   సమాజం నుండి ఆడపిల్లే కావాలని కోరుకునేంత పురోగతి సాధించాని చెప్పారు. ఈ రోజున ఆడపిల్లల పట్ల వివక్ష చూపమని ప్రతిజ్ఞ చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అందరూ సమానమేనని వివక్షత లేని సమాజం కావాలని చెప్పారు.  ఆడపిల్లలే అన్న  భావన ప్రతి ఒక్కరిలో తొలగిపోవాలని చెప్పారు. ఆడపిల్లలను  తక్కువ అంచనా  వేయొద్దని  నేడు బాలురతో సమానంగా అన్ని రంగాలలో బాలికలు రాణిస్తున్నారని చెప్పారు.