భద్రాద్రి జిల్లాకు 14 పతకాలు

భద్రాద్రి జిల్లాకు 14 పతకాలు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ లో బద్రాద్రి జిల్లా అథ్లెట్లు   14  పతకాలు  సాధించారని జిల్లా ఆర్థటిక్ అసోసియేషన్ కార్యదర్శి మహిధర్ ఆదివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అద్వర్యం లో హన్మకొండ లోని జవహర్లాల్  నెహ్రు స్టేడియం లో ఈ నెల 25 మరియు 26 వ తేదీలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బద్రాద్రి జిల్లా అథ్లెట్లు 20 మంది పాల్గొని  14  పతకాలు  సాధించారని తెలిపారు.ఇందులో 9 బంగారు పతకాలు ,4 రజిత పతకాలు 1 కాంశ్య పతకాలు ఉన్నాయన్నారు. పాల్వంచ కు చెందిన R .అభినయ్ నాయక్ ,లాంగ్ జంపు ,110  మీటర్ల హర్డిల్స్ లో రెండు బంగారు పతకాలు ,టేకులపల్లి కి చెందిన జి.సిద్ది వినయ్ ,హై జంపు  లో బంగారు పతకం,  కొత్తగుడెం కు చెందిన ఎం.ఇందు ,3km లో బంగారు పతకం ,ఎం సంగీత 5km వాకింగ్ లో బంగారు పతకం,  వందన ,డిస్కస్ త్రో లో బంగారు పతకం,ఎం. అఖిల్, ౩౦౦౦మీటర్ల పరుగుపందెంలో లోబంగారు పతకం, జె . వరుణ్ 400 మీటర్ల పరుగుపందం లో బంగారు పతకం, పాల్వంచ కు చెందిన బి. దేఖేష్ సౌమిత్ 400 మీటర్ల హర్డిల్స్ లో రజిత పతకం, కొత్తగుడెం కు చెందిన ఎం. సింధు 400 మీటర్ల పరుగుపందం లో రజత పతకం,ఏ .వందన ,షాట్ పుట్ త్రో లో రజత పతకం,అభినవ ,అశోక్ ,అఖిల ,సౌమిత్ లు రిలే లో రజత పతకం ,పాల్వంచ కు చెందిన కె. అశోక 400 మీటర్ల పరుగుపందం లో కాంశ్య పతకాలు సాధించడం అభినందనీయం అన్నారు , పథకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్ లను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర అసోసియేషన్ అద్యక్చులు స్టాన్లీ జోన్స్ ,కార్యదర్శి కె.సారంగపాణి ,బద్రాద్రి జిల్లా అద్యక్చులు గొట్టపు రాధాకృష్ణ ,చైర్మన్ GVK మనోహర రావు తదితరులు పాల్గొన్నారు.