మధు అరాచకాలను ఖండించండి: ప్రజాపంథా నేతలు

మధు అరాచకాలను ఖండించండి: ప్రజాపంథా నేతలు

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు మధు అరాచకాలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని సిపిఎంఎల్ ప్రజాపంథా నాయకులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజా పంథా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇల్లందులోని చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్ లో కి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించి భవనం గోడలను ధ్వంసం చేసిన మదురై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రజా పంథా నాయకులు, కార్యకర్తలపై న్యూ డెమోక్రసీ నాయకులు భౌతిక దాడులు దిగడం సరైంది కాదన్నారు. మధు ఒంటెద్దు పోగోడలకు స్వస్తి పలికి పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు . సమావేశంలో ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ ,చంద్ర అరుణ ,కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.