రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం

రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం
Friend Foundation blood Donation camp

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అన్ని దానాలకంటే రక్తదానం మిన్న అని,  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎం కోటేశ్వరరావు యువతకు పిలుపునిచ్చారు. లక్ష్మిదేవిపల్లి మండలంలోని కృష్ణవేణి జానియర్‌ కళాశాలలో మంగళవారం ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాదపడుతున్న వారికి రక్తదాన శిభిరం నిర్వహించడం సంతోషం అన్నారు. మీ రక్తదానంతో తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలన్ని 20 రోజులు పెంచిన వారు అవుతారని, ఈ శిభిరానికి పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేసిన యువతను, ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులను అభినందించారు.

ఫౌండేషన్‌ సేవలు విస్తరించి మరెందరో తలసీమియా వ్యాధి బాధితుల జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం ఫౌండేషన్‌ నిర్వాహకుడు సిహెచ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తునికి ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించవలసి ఉంటుందన్నారు. ఈవ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 3 నుండి 4 వారాలకు ఒకసారి రక్తం బయటనుండి అందించవలసి ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సంకల్ప స్వచ్ఛంద సేవాసమితి తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలు మరువలేనివి అన్నారు.  ఈ కార్యక్రమలో జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ బి వీరన్న, పి అశోక్‌ రెడ్డి, డి విజయ్‌ కుమార్‌, బి హరికృష్ణ, బ్రహ్మానంద రెడ్డి, కె సత్యనారాయణ, ఫౌండేషన్‌ సభ్యులు మహేష్‌, శివ, సిద్ధు, సాయి, సాయిరామ్‌, రోహిత్‌ తదితరులు  పాల్గొన్నారు.