పూర్వ విద్యార్థుల కలయిక

పూర్వ విద్యార్థుల కలయిక

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: చిన్ననాటి స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ పాఠశాల చెందిన 1993 ఏడవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత స్నేహితులు కలవడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపారు. వివిధ రంగాలలో స్థిరపడ్డ వారు ఒకసారి చిన్నపిల్లల వారి ఆటలాడుతూ ఆనందంగా గడిపారు.

గెట్ టుగెదర్ కార్యక్రమం కేవలం ఆహ్లాదం కోసమే కాదని తమ చిన్ననాటి స్నేహితులకు ఏ విధమైన ఆపద వచ్చిన అండగా ఉండేందుకు అందరం సిద్ధంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభద్ర, ఉష, లలిత, నాగమణి, భాగ్యలక్ష్మి, కనకతార, పుష్పలత, కేదారేశ్వర రావు, శ్రీనివాస్, డాక్టర్ రామారావు, పొగాకు రామారావు, రమణయ్య, కృష్ణ, సోమయ్య, దేవేందర్, నాగేశ్వరరావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.