గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి

గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి

గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ వీరయ్య డిమాండ్

భువనగిరి (ముద్ర న్యూస్ ): గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర ఎనిమిదవ రోజు జిల్లా కేంద్రం చేరుకున్న సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ వీరయ్య  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో పాటు గ్రామ పంచాయతీ యూనియన్ ఆరుగురు నాయకులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం  భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా రైల్వేస్టేషన్ నుండి భువనగిరి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబెడ్కర్ విగ్రహానికి బృందం సభ్యులు పూలమాల వేసిన అనంతరం గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దాసరి పాండు అద్యక్షతన  బహిరంగ సభ జరిగింది.

ఈ సభ కు ముఖ్య అతిథిగా హజరైన యస్ వీరయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం చాకిరి చేపిస్తూ మరో వైపు జిఓ నెంబర్ 51 ని తిసుకువచ్చి మల్టిపర్పస్ విధానం అని ముద్దు పేరు పెట్టి అన్ని రకాల పనులను చేయాలని గ్రామాలలోని కార్మికుల పై ఒత్తిడి చేస్తున్నారని జిఓ 51 ని రద్దు చేయాలని, కరోన సమయంలో ప్రాణాలు తెగించి పనులు చేసిన గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.జీవిత కాలం పనిచేసిన కనీస వేతనం లేదని,పెంచన్ ,పిఎఫ్, ఇయస్ఐ సౌకర్యం లేదని ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని లేని యేడల సిఐటియు అద్వర్యం లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదు: పాలడుగు భాస్కర్ జిపి యూనియన్ గౌరవ అధ్యక్షులు

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి12 న పాలకుర్తి నుండి ప్రారంభమైన పాదయాత్ర ఫిబ్రవరి28 వరకు కొనసాగుతుందని ఈ లోపు ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లేని యేడల ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్& వర్కర్స్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్ తో పాటు రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైళ్ళ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వినోద్ కుమార్, మహేష్ లు పాదయాత్ర బృందం సభ్యులు ఉండగా ఈ బహిరంగ సభ లో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర ఉపాద్యక్షులు పాలడుగు సుధాకర్, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కల్లూరి మల్లేశం, కొమటిరెడ్డి చంద్రారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి గోపాల స్వామి, నాగర్ కరూల్ జిల్లా బత్తిని వెంకటేశ్వర్లు, యం మల్లేశం, యూనియన్ జిల్లా అద్యక్షులు బందెల బిక్షం, సిఐటియు జిల్లా సహయ కార్యదర్శులు మాయ కృష్ణ, బోడ ఉదయ భాగ్య నాయకులు గంధమల్ల మాతయ్య, కొల్లూరి అంజనేయులు,పోతరాజు జహంగీర్, తూటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.