జాతీయ సంపదను సమష్టి ఉద్యమాలతో కాపాడుకుందాం

జాతీయ సంపదను సమష్టి ఉద్యమాలతో కాపాడుకుందాం
CPI State Secretary, former MLA Koonanneni Sambasivarao

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జాతీయ సంపదను సమష్టి ఉద్యమాలతో కాపాడుకుందాం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే  కూణంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో పంచాయతీల స్థాయి ప్రజా చైతన్య సదస్సులు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి ప్రజాదరణ కొదవ లేదన్నారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా  ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ కృషి చేస్తుందన్నారు. సమైక్యత సహనంతో కూడిన దేశాన్ని నిర్మించేందుకు యువత కృషి చేయాలన్నారు. గ్రామాలలో ప్రజలు కనీస మౌలిక వసతులకు నోచుకో పోవడం దారుణం అన్నారు.

పాలకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు  అందేవరకు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అవసరమైన పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యకర్తలు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో సిపిఐ  జిల్లా కార్యదర్శి  సాబీర్ పాషా ప్రసంగించగా మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు గుత్తుల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రత్నకుమారి, లక్ష్మి, గోవింద్, మురళి, సత్యం, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.