ఆర్ధిక నేరగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న  ప్రధాని మోదీ

ఆర్ధిక నేరగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న  ప్రధాని మోదీ
CPI district secretary SK Sabir Pasha
  •  అదాని స్టాక్స్ కుంభకోణం పై విచారణ నిర్వహించాలి
  • ఎల్ఐసి, ఎస్ బి ఐ  సంస్థలను లూటీ చేసిన ఆదాని తక్షణమే అరెస్టు చేయాలి
  • సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రధాని మోడి దేశంలోని ఆర్ధిక నేరాగాళ్ళకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడని, కోట్లాది రూపాయలు దేశ సంపదను, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నా మోడీ నోరుమెదకపకపోవడం వెనుక ఆంతర్యమేమిటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా ప్రశ్నించారు. Adani stocks scam ఆదాని స్టాక్స్ కుంభకోణంలో ఆదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం ఎస్ బిఐ ప్రధాన ద్వారాన్నీ మూసివేసి ధర్నా చేపట్టారు.  

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ The Hidenburg Report హిడెన్బర్గ్ నివేదికతో ఆదాని అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యాయని, మోడీ సహకారంతో ఆదాని దేశసంపదను దోచుకొని ప్రపంచ కుభేరుల్లో మూడో వ్యక్తిగా స్థానం దక్కించుకున్నాడని విమర్శించారు. మోడీ ఆదేశాలతోనే ఎస్ బిఐ, ఎల్ఐసి  సంస్థలు అదాని సంస్థల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టాయని, హిడెన్బర్గ్ నివేదికతో షేర్ల ధరలు పడిపోయి రెండు రోజుల్లోనే ఎల్ఐసి రూ.18వేల కోట్లు, ఎస్బిఐరూ.56వేల కోట్లు నష్టపోయా న్నారు.

ప్రజలు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రజాసంపదను కార్పోరేట్లకు దోచిపెట్టే అధికారం మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. భారీ మొత్తంలో కుంభకోణానికి పాల్పడిన ఆదానీ ఉదంతంతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. అతితక్కవ కాలంలో ప్రపంచంలోనే మూడో ఆస్తిపరుడుగా ఎదిగిన ఆదాని అతితక్కవ పన్ను కడుతున్నారని, ఇదేలా సాధ్యమో మోడీ సమాదానం చెప్పాలన్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబాలైన ఎస్ బి ఐ, ఎల్ఐసి లాంటి సంస్థల మెడపై కత్తిపెట్టి అదానీకి రుణాలు ఇప్పించారని ఆరోపించారు. జరిగిన కుంభకోణంకు  ప్రధాని నరేంద్రమోడీ  భాద్యత వహించాలని, ప్రభుత్వరంగ సంస్థలను లూటీ చేసిన ఆదాని తక్షణమే అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకతప్పదని హెచ్చరించారు.